రీసెంట్ టైం లో బహుశా ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు…. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు కొన్ని వారాలకే పరిమితం అవుతూ ఉన్న టైం లో ఈ మధ్య ఏ సినిమా విషయంలో జరగనిది బాలయ్య బోయపాటిల లేటెస్ట్ మూవీ అఖండ విషయంలో మాత్రం జరిగింది అని చెప్పాలి. రీసెంట్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 75 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా…
సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఇప్పుడు మరో రేర్ ఫీట్ ని సాధించింది అని చెప్పొచ్చు…. రీసెంట్ టైం లో ఏ సినిమా కూడా సాధించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ రోజులు డెఫిసిట్ లు లేకుండా పరుగును కొనసాగించిన సినిమాగా నిలిచింది అఖండ సినిమా…
ఆల్ మోస్ట్ 60 రోజుల్లో అతి కొద్ది రోజుల్లో కొన్ని సెంటర్స్ లో డెఫిసిట్ లు పడ్డా ప్రతీ రోజూ షేర్స్ మాత్రం కచ్చితంగా సొంతం చేసుకుంటూ వచ్చిన సినిమా 61 వ రోజు మాత్రం కొంచం తగ్గింది… అయినా కానీ ఓవరాల్ గా 60 రోజులకు పైగా డెఫిసిట్ లు లేకుండా రన్ అయ్యి అఖండ సంచలనం సృష్టించింది అని చెప్పాలి.