బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెలవుల నుండి ఇప్పటి వరకు సోలో బిగ్గీ గా నిలిచిన బంగార్రాజు సినిమా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించినా కానీ ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా బిజినెస్ ను దాటేసి బ్రేక్ ఈవెన్ అయినా కానీ మొత్తం మీద 23 రోజులు పూర్తీ అయ్యే టైం కి 38.40 కోట్ల షేర్ ని….
సొంతం చేసుకోగా సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకో 60 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా ఈ కలెక్షన్స్ కోసం మరింత టైం పట్టేలా ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా ఒక్క నైజాం ఏరియాలో అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని…
సొంతం చేసుకుని ఉంటే ఈ పాటికి లాభాల్లో ఉండేది… నైజాంలో 11 కోట్ల బిజినెస్ కి 8.34 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడం వలన మిగిలిన ఏరియాల పై ఎఫెక్ట్ పడి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకునేలా చేయలేదు… కానీ సినిమా ఈ అవరోధాన్ని సైతం దాటి మరో వారం పరుగును కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోవచ్చు.