మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర 11న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు మేకర్స్… క్రాక్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత రొటీన్ మూవీతో కాకుండా ఒక ఎక్స్ పెరిమెంటల్ లా అనిపించే కాన్సెప్ట్ తో ఖిలాడిగా రవితేజ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా….
సినిమా ట్రైలర్ లో కథ ఏంటి అనేది క్లియర్ గా తెలియకున్నా కానీ టేకింగ్ బాగుండటం, విజువల్స్ గ్రాండియర్ గా ఉండటం, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండటం, అన్నింటికీ మించి రవితేజ ఎనర్జీ సాలిడ్ గానే ఉన్నట్లు కనిపిస్తూ ఉండటంతో కచ్చితంగా సినిమా….
బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుందని చెప్పాలి. ఇక ట్రైలర్ ను మేకర్స్ ముందు ఒక టైం అనుకున్నా ఆ టైం కి రిలీజ్ చేయకుండా ఆలస్యం చేసి తర్వాత ఫ్యాన్స్ చిరాకు పడిన తర్వాత లేట్ గా రిలీజ్ చేయడం తో ఆ ఇంపాక్ట్ ఓవరాల్ గా వ్యూస్ మీద పడ్డాయి….
లైక్స్ పరంగా రవితేజ కెరీర్ బెస్ట్ ను అందుకున్న ఖిలాడి క్రాక్ సాధించిన 205.3K లైక్స్ ని క్రాస్ చేసి 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 236K లైక్స్ ని సాధించి రవితేజ కెరీర్ లో లైక్స్ పరంగా కొత్త రికార్డ్ ను అందుకోగా వ్యూస్ పరంగా మాత్రం లేట్ రిలీజ్ వలన క్రాక్ కి అందుకోలేక దెబ్బ పడినట్లు అయింది…
క్రాక్ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 6.69M వ్యూస్ తో దుమ్ము లేపగా ఇప్పుడు ఖిలాడి ట్రైలర్ మాత్రం లేట్ రిలీజ్ వలన దెబ్బ పడి 5.30 మిలియన్ వ్యూస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా కానీ ఓవరాల్ గా యాడ్స్ లాంటివి లేకుండా ఆర్గానిక్ గా సాలిడ్ రెస్పాన్స్ నే సినిమా ట్రైలర్ సొంతం చేసుకుంది. ఇక సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.