మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ టైం దగ్గర పడింది… సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేయగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సాలిడ్ గానే సొంతం చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాలిడ్ బిజినెస్ ను దక్కించుకోగా ఇప్పుడు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా కి ఫస్ట్ దెబ్బ తగిలింది….
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు రిలీజ్ కి వారం ముందు వరకు జరగడం, రవితేజ సినిమా డబ్బింగ్ ను రీసెంట్ గా కంప్లీట్ చేయడం, దానికి తోడూ సినిమా సెన్సార్ కి కూడా ఆలస్యంగా వెళ్ళడం లాంటివి ఇబ్బందిగా మారి సినిమా కి ఇప్పుడు ఓవర్సీస్ లో ప్రింట్స్….
ఆలస్యంగా వెళ్ళబోతున్నాయని సమాచారం. ఈ కారణం వలన సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను జరుపుకోవడం లేదు అనేది ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం, అన్ని చోట్లకు సినిమా ప్రింట్స్ వెళ్ళడానికి టైం పట్టేలా ఉండటంతో ప్రీమియర్ షోలు చాలా ఏరియాల్లో కాన్సిల్ అయ్యి…
ఇక్కడ రిలీజ్ అయిన రోజునే అక్కడ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని సమాచారం, ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సినిమా షోలు 10 న అక్కడ పడటం చాలా కష్టమే అని అంటున్నారు ఇప్పుడు… దాంతో అక్కడ సినిమా ఓపెనింగ్స్ పై ఈ ఇంపాక్ట్ గట్టిగానే ఉండే అవకాశం ఉండగా ఇక్కడ తో పాటు అక్కడ కూడా ఒకే రోజు ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పాలి…
అసలు సినిమా 11న రిలీజ్ అవుతుంది అని వారం ముందు కూడా క్లారిటీ లేదు కానీ మంచి డేట్ అవ్వడంతో మేకర్స్ చివరి నిమిషం దాకా కష్టపడి ఆ డేట్ కి సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు కానీ ప్రీమియర్ షోల దెబ్బని మాత్రం ఆపలేకపోతున్నారని సమాచారం. మరి ఏదైనా అద్బుతం జరుగుతుందా లేక ఇక ప్రీమియర్స్ లేనట్టేనా అన్నది చూడాలి ఇక…