మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా ఇప్పుడు రవితేజ కి కీలకంగా మారింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాక్ సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న రవితేజ ఈ సినిమాతో మరో హిట్ ని అందుకుంటే తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి…
ఇక క్రాక్ సినిమా తో పోల్చితే ఖిలాడి బిజినెస్ కూడా ఎక్స్ లెంట్ గా జరిగింది తెలుగు రాష్ట్రాల్లో… ఆంధ్రలో పరిస్థితుల ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా రవితేజ సినిమాను కొనడానికి బయ్యర్లు ఎగబడ్డారు. దాంతో ఓవరాల్ గా సాలిడ్ రేటు ఈ సినిమా కి సొంతం అయ్యింది.
ఇక ఈ సినిమాను హిందీలో నిర్మాతలే ఓన్ గా రిలీజ్ చేస్తూ ఉండటంతో అక్కడ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు సాలిడ్ టార్గెట్ తోనే బరిలోకి దిగుతుంది. ఒకసారి సినిమా సాధించిన ఏరియాల వారి బిజినెస్ ను గమనిస్తే….
👉Nizam: 8Cr
👉Ceeded: 3.50Cr
👉Andhra: 10Cr
AP-TG Total:- 21.50CR
👉KA+ROI: 2.10Cr
👉OS: 1.2Cr
Total WW: 24.80CR
ఇదీ ఓవరాల్ గా ఖిలాడి మూవీ సొంతం చేసుకున్న టోటల్ బిజినెస్ లెక్క… క్రాక్ సినిమా తో పోల్చితే ఈ సినిమా కి బిజినెస్ ఆల్ మోస్ట్ 7.8 కోట్ల రేంజ్ లో ఎక్కువగా జరగడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 25.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సినిమా క్లీన్ హిట్ అవుతుంది. రవితేజ మరి క్రాక్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఖిలాడి సినిమా తో రచ్చ చేస్తే కచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.