Home న్యూస్ మైండ్ బ్లాంక్: ఖిలాడి బడ్జెట్ ఇంత అయిందా….రికవరీ ఎంత అయ్యిందో తెలుసా!!

మైండ్ బ్లాంక్: ఖిలాడి బడ్జెట్ ఇంత అయిందా….రికవరీ ఎంత అయ్యిందో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా 24.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 25.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగుతుంది… ఇక సినిమా గురించిన….

మరో న్యూస్ ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది…. కాగా సినిమా కి పెట్టిన బడ్జెట్ అంచనాలను కూడా మించి పోయిందని అంటున్నారు ఇప్పుడు…. కాగా సినిమాను ముందుగా 35 కోట్ల రేంజ్ లో అనుకున్నారు కానీ కథ డిమాండ్ మేరకు బడ్జెట్ పెరుగుతూ పోయి….

ఏకంగా 58-60 కోట్ల మధ్యలో సినిమా ఓవరాల్ బడ్జెట్ అయిందని సమాచారం. ఈ రేంజ్ బడ్జెట్ అవుతుందని ముందు అనుకోలేదు కానీ సినిమాలో కంటెంట్ ని నమ్మి నిర్మాత ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టారట. ఇక రికవరీ విషయానికి వస్తే సినిమా కి రిలీజ్ కి ముందు ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద….

మొత్తం మీద 25 కోట్ల దాకా రికవరీ డిజిటల్, శాటిలైట్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా కలుపుకుని సొంతం అయ్యిందట. ఇక ఇప్పుడు బిజినెస్ కూడా ఓవరాల్ గా 24.80 కోట్ల దాకా జరగగా ఓవరాల్ గా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి 50 కోట్ల మేర రికవరీ అవ్వగా సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ 8-10 కోట్ల రేంజ్ డెఫిసిట్ తోనే రిలీజ్ అవుతుందని సమాచారం….

కానీ నిర్మాత హిందీలో సినిమాను ఓన్ గా రిలీజ్ చేస్తూ ఉండటం తో అక్కడ నుండి వచ్చే కలెక్షన్స్ ఇప్పుడు కీలకంగా మారింది అని చెప్పాలి. అలాగే తెలుగు లో కూడా సినిమా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటే ఈ మిగిలిన బడ్జెట్ రికవరీ అవుతుందని నమ్మకంగా ఉన్నారని సమాచారం. ఈ రేంజ్ బడ్జెట్ అయిన ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here