మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ పరంగా ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడింది. దానికి తోడూ సినిమా లేట్ గా బుకింగ్స్ ఓపెన్ అవ్వడం ఆన్ లైన్ బుకింగ్స్ అంతంత మాత్రమే జరగడం లాంటివి ఇంపాక్ట్ ని చూపాయి అని చెప్పాలి.
అయినా వీటిని తట్టుకుని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో జోరు చూపిన మాస్ మహారాజ్ అక్కడ మంచి ఓపెనింగ్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకున్నా కానీ మొత్తం మీద అవి అంచనాలను అయితే అందుకోలేదు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ వర్త్ షేర్ మొత్తం మీద 3.8 కోట్లు మాత్రమే సొంతం అయ్యింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ వర్షన్ కలెక్షన్స్ ఇంకా అప్ డేట్ అవ్వాల్సి ఉండగా అవి కాకుండా టోటల్ వరల్డ్ వైడ్ గా….
ఖిలాడి సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.86Cr
👉Ceeded: 56L
👉UA: 46L(11L hires)
👉East: 26L
👉West: 21L
👉Guntur: 56L(30L hires)
👉Krishna: 18L
👉Nellore: 21L(8L hires)
AP-TG Total:- 4.30CR(6.80Cr~ Gross) (49L Hires)
👉Ka+ROI: 0.38Cr
👉OS – 0.16Cr
Total WW: 4.84CR(8CR~ Gross)
ఇవీ మొత్తం మీద సినిమా సాధించిన ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…
సినిమాను మొత్తం మీద 22.80 కోట్లకు అమ్మగా సినిమా 23.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా ఇంకా 18.66 కోట్ల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ ని సాధిస్తుంది. ఇక రెండో రోజు సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి…