బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఖిలాడి రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉంది కానీ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ కలక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి… కానీ సినిమా పరుగును స్టడీగా ఇలానే కొనసాగిస్తూ ఉంటే చాలా వరకు కలెక్షన్స్ ని రిటర్న్ తీసుకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాలి….
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 4 వ రోజు వాలంటైన్స్ డే అడ్వాంటేజ్ వలన ఉన్నంతలో మంచి వసూళ్ళతో హోల్డ్ చేసింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
75 లక్షల నుండి 80 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా సినిమా రోజును మొత్తం మీద 87 లక్షలతో ముగించింది అని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
👉Nizam: 3.27Cr
👉Ceeded: 1.33Cr
👉UA: 1.13Cr
👉East: 61L
👉West: 51L
👉Guntur: 90L
👉Krishna: 46L
👉Nellore: 42L
AP-TG Total:- 8.63CR(14.55Cr~ Gross)
👉Ka+ROI: 0.71Cr
👉OS – 0.40Cr
👉Hindi – 0.30Cr
Total WW: 10.04CR(18CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…. మొత్తం మీద ఖిలాడి సినిమాను…
22.80 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 23.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 4 రోజులు పూర్తీ అయిన తర్వాత మిగిలిన రన్ లో ఇంకా 13.46 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగూ ఈ వీక్ పెద్దగా నోటెడ్ మూవీస్ ఏమి లేవు కాబట్టి సినిమా పరుగును స్టడీగా కొనసాగిస్తే మరింత కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు.