బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వేవ్ లు ఒకటికి మించి ఒకటి దెబ్బ కొడుతూ ఉంటే మరో పక్క ఆంధ్రలో టికెట్ రేట్లు టికెట్ హైక్స్ గొడవ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వడం లేదు, రీసెంట్ గా ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళడంతో ఒక్క వారంలోనే అంతా సెట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ కావాలని చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విషయంలో…
ఆంధ్రలో ప్రభుత్వం చాలా సీరియస్ గా రాష్ట్రంలో ఇంకా ఏ ఇబ్బందులు లేనట్లు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటూ టికెట్ రేట్ల చుట్టూనే తిరుగు ఉంది. భీమ్లా నాయక్ రిలీజ్ కి ముందే టికెట్ హైక్స్ కూడా వచ్చేస్తాయి అని ఇండస్ట్రీ పెద్దలు చెప్పినా ప్రభుత్వం దానిపై ఏమాత్రం స్పందించకుండా….
మార్చ్ మొదటి వారంలో స్పందించే అవకాశం ఉందని అంటుండగా భీమ్లా నాయక్ ని కావాలని దెబ్బ కొట్టాలి అన్నట్లు ఎక్కడా కూడా బెనిఫిట్ షోలు కానీ స్పెషల్ షోలు కానీ వేస్తె పరిస్థితులు చాలా సీరియస్ గా ఉంటాయని హెచ్చరిస్తూ ఉందని… నిన్న ఈ విషయం పై ప్రభుత్వం నుండి వచ్చిన హెచ్చరిక ఇలా ఉంది…
భీమ్లా నాయక్ సినిమాకి బెన్ ఫిట్ షో ఉండదు. అతిక్రమించి బెన్ ఫిట్ షో వేస్తే కఠిన చర్యలు తప్పవు. టికెట్ రేట్లు ప్రభుత్వ నిభందనల మేరకు ఉండాలి. ప్రతి ధియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుంది. ధియేటర్ యాజమాన్యం సహకరించాలి. అంటూ చెప్పగా ఈ రోజు మరోసారి మరో హెచ్చరికని జారీ చేశారు… జీవో నంబర్ 35 ప్రకారం పాత టిక్కెట్ రేటుకే భీమ్లా నాయక్ టికెట్స్ ని అమ్మాలని స్పష్టం చేసిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అధికారులు…
అదనపు షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక అంటూ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, ఒక పక్క నైజాంలో స్పెషల్ షోలు, టికెట్ హైక్స్ కావలసినన్ని అవకాశాలను ఇస్తూ ఉంటే మరో పక్క ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ఇలా చేస్తూ ఉండటంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే రికార్డు ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతుంది అనుకున్న భీమ్లా కి లాస్ట్ మినట్ లో ఈ ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది… కానీ ఉన్నంతలో 100% ఆక్యుపెన్సీ ఒక్కటి ఇవ్వడం కొంచం ఊపిరి పీల్చుకునే విషయం అని చెప్పాలి.