బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ వరల్డ్ వైడ్ గా 1900 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో సినిమా ఆల్ రెడీ దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా….
భారీ లెవల్ లో రిలీజ్ అవ్వగా ఆంధ్రలో ప్రభుత్వం నుండి ఫుల్ సెక్యూరిటీతో రిలీజ్ అవ్వడంతో మునుపటి సందడి మిస్ అయింది, ఇక సి డి సెంటర్స్ లో తక్కువ టికెట్ రేట్స్ వలన కొన్ని థియేటర్స్ సినిమాను ప్రదర్శితం కూడా చేయడం లేదు. ఇక నైజాం ఏరియాలో కొన్ని చోట్లా….
టికెట్ రేట్స్ మరీ ఎక్కువ అవ్వడం అండ్ షోలు కూడా మరీ ఎక్కువ అవ్వడం తో ఆక్యుపెన్సీ అక్కడ కొంచం తక్కువగా ఉంది కానీ ఓవరాల్ గా 70-80% ఆక్యుపెన్సీతో ఓవరాల్ గా నైజాంలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ సినిమా ఓపెన్ అయ్యింది అని చెప్పాలి.
ఇక సీడెడ్ లో సినిమా ఊరమాస్ అనిపించే రేంజ్ లో ఓపెన్ అవ్వగా ఆంధ్ర రీజన్ అన్ని చోట్లా కూడా సినిమా కి ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గా ఉంది, ఇక మ్యాట్నీ షోల టైం కి ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల ఆక్యుపెన్సీ 60-65% రేంజ్ లో ఉంటుందని అంచనా, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా ఊరమాస్ గా ఉన్నాయి అని చెప్పాలి.
దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 25 కోట్ల నుండి 26 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది, ఆంధ్రలో టికెట్ రేట్లు బాగుంటే లెక్క మరింత ఎక్కువగా ఉండేది కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతూ ఉండటంతో అక్కడ కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది, అయినా కానీ ఇది రీసెంట్ టైం లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా గ్రోత్ ఇంకా ఎంతవరకు ఉంటుందో చూడాలి ఇక…