Home న్యూస్ భీమ్లా నాయక్ 1st డే కలెక్షన్స్…..సెన్సేషనల్ డే 1…కానీ!!

భీమ్లా నాయక్ 1st డే కలెక్షన్స్…..సెన్సేషనల్ డే 1…కానీ!!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో 1900 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ పరంగా దుమ్ము దులిపేసింది అని చెప్పాలి. సినిమా నైజాం ఏరియాలో స్పెషల్ మార్నింగ్ షోలు కొన్ని చోట్లా అంచనాలను అందుకోక పోయినా కానీ రెగ్యులర్ షోల పరంగా మాత్రం….

అన్ని షోలు ఓ రేంజ్ లో దుమ్ము దులిపేశాయి. టికెట్ హైక్స్ భారీగా ఉన్నా కానీ సినిమా ఎక్స్ లెంట్ గా నైజాంలో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాస్ బ్యాటింగ్ ని చూపెట్టింది, దాంతో నైజాంలో ఇప్పుడు ఓపెనింగ్స్ పరంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని….

అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక్కడ ఈ రేంజ్ లో రెచ్చిపోయిన సినిమా కి ఆంధ్రలో సి డి సెంటర్స్ లో మొత్తం మీద లో టికెట్ రేట్స్ వలన, అలాగే ఆ థియేటర్స్ ప్రభుత్వం నుండి వ్యక్తులు పోలీసులు వచ్చి చెక్ చేయడం లాంటివి చేయడంతో ఆ రేట్స్ తో థియేటర్స్ ని నడపలేక….

థియేటర్స్ ని క్లోజ్ చేశారు, ఆ థియేటర్స్ క్లోజ్ వలన ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ గట్టిగానే పడేటట్లు ఉందని చెప్పాలి. కానీ ఉన్న థియేటర్స్ లో టికెట్ రేట్స్ ఎలా ఉన్నా బుకింగ్స్ అండ్ ఆక్యుపెన్సీ మాత్రం దుమ్ము లేపింది అనే చెప్పాలి. మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ టికెట్ రేట్స్ వలన ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ ఓపెనింగ్స్ కుమ్మేశాయి అని చెప్పాలి.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 26 కోట్ల నుండి 27 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 34 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకోవచ్చు, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను మించి పొతే ఈ కలెక్షన్స్ కూడా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, మరి అఫీషియల్ గా సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here