బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మొదటి 3 రోజుల వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని ఆంధ్రలో పరిస్థితులు బాగా లేకున్నా కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపగా సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు…
హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకున్నా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి కొద్ది వరకు గ్రోత్ ని చూపెట్టింది, మొత్తం మీద సినిమా 5.5 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించినా కానీ అలా జరగలేదు.
ఫస్ట్ టైం సినిమా 4 వ రోజు అంచనాలను అందుకోలేక దెబ్బ పడగా 5.18 కోట్ల షేర్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సరిపెట్టుకుంది సినిమా…. అంటే సినిమా 3 వ రోజు తో పోల్చితే నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 8.33 కోట్ల రేంజ్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…
ఇక సినిమా 4 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 28.24Cr(inc GST)
👉Ceeded: 7.74Cr
👉UA: 5.37Cr
👉East: 3.95Cr
👉West: 4.12Cr
👉Guntur: 4.22Cr
👉Krishna: 2.63Cr
👉Nellore: 1.98Cr
AP-TG Total:- 58.25CR(87.60Cr~ Gross)
KA+ROI: 6.65Cr
OS: 10.31Cr
Total World Wide: 75.21CR(120CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద 108 కోట్ల రేంజ్ టార్గెట్ ని అందుకోవడానికి సినిమా ఇప్పుడు 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 32.79 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇక 5 వ రోజు మాత్రం మహా శివరాత్రి హాలిడే ఉన్న నేపధ్యంలో సినిమా తిరిగి జోరు చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Box office analysis prakaram 128.38 gross vunte meru matram 120 pettaru , Mee channel meda manchi respect vundi Danni pogottukokandi please