బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ రిలీజ్ అయిన మొదటి మూడు రోజుల తర్వాత ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు కొంచం స్లో డౌన్ అవ్వక తప్పలేదు, సినిమా కి ఫుల్ వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన డ్రాప్స్ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా రావడం జరిగింది. మొత్తం మీద సినిమా….
ఇప్పుడు నాలుగో రోజు డ్రాప్ అయినా కానీ 5 వ రోజు కి వచ్చే సరికి మాత్రం మహా శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ వలన బాగానే హోల్డ్ చేస్తూ దూసుకు పోతుంది అని చెప్పాలి. చాలా సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 4 వ రోజు తో పోల్చితే 5 వ రోజు…..మార్నింగ్ అండ్…..
మ్యాట్నీ షోలకు డ్రాప్స్ చాలా తక్కువగానే ఉండగా కొన్ని చోట్ల సినిమా 4 వ రోజు కన్నా బెటర్ గా ఓపెన్ అయింది అని చెప్పాలి. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా బాగుండగా శివరాత్రి కానుకగా మిడ్ నైట్ షోలు కూడా ప్లాన్ చేశారు భీమ్లా నాయక్ కి ఇప్పుడు…
దాంతో మొత్తం మీద సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో ఇరగదీయడం ఖాయంగా కనిపిస్తుంది, ప్రజెంట్ బుకింగ్స్ అండ్ హోల్డ్ ని బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు సినిమా 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. నార్మల్ టైం లో అయితే 4 వ రోజు తో పోల్చితే…
5 వ రోజు డ్రాప్స్ 20-25% వరకు ఉంటాయి, కానీ ఇప్పుడు హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో ఆల్ మోస్ట్ 4 వ రోజు లెవల్ నుండి కొంచం గ్రోత్ ని సినిమా చూపించే అవకాశం ఉండగా రోజు మొత్తం సినిమా జోరు ఎలా ఉంటుంది అన్న దానిపై ఈ కలెక్షన్స్ ని దాటుతుందా లేక ఇదే లెవల్ లో ఉంటుందా అన్నది చెప్పగలం…డే ఎండ్ అయ్యే టైం కి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం….