బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ వకీల్ సాబ్ సినిమా తో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వగా పీక్ సెకెండ్ వేవ్ స్టేజ్ లో ఆంధ్రలో లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 121 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
దుమ్ము దుమారం లేపింది, ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా కూడా ఆంధ్రలో లో టికెట్ రేట్స్ వలన ఇబ్బందులను ఫేస్ చేసినా కానీ ఓవరాల్ గా…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది అని చెప్పాలి… సినిమా మొత్తం మీద 6 రోజుల తర్వాత…
104.80 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బాక్ టు బాక్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. కాగా ఇక్కడ మరో విశేషం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు టికెట్ రేట్స్ పరిస్థితులలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలా బాక్ టు బాక్…
100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలవడం విశేషం, ఆంధ్ర లో పరిస్థితులు సెట్ అయ్యి ఉంటే ఈ పాటికే వకీల్ సాబ్ టోటల్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని అందుకుని ఉండేది భీమ్లా నాయక్, కానీ లాంగ్ రన్ లో మాత్రం మరింత దూరం సినిమా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…