SR కళ్యాణ మండపం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం ఆడియన్స్ ముందుకు ఇప్పుడు క్రైం థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సెబాస్టియన్ PC 524 అనే డిఫెరెంట్ మూవీతో వచ్చేశాడు, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటంతో డీసెంట్ అంచనాలు సినిమా పై ఏర్పడగా సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. రే చీకటి ఉన్న హీరో తన తండ్రి కోరిక మేరకు పట్టుదలతో…
అమ్మ ఆశీస్సులతో కానిస్టేబుల్ అవుతాడు, తనకి రే చీకటి ఉన్న విషయం చెప్పకుండా నైట్ షిఫ్ట్ లు ఎగ్గొట్టడంతో పలుసార్లు ట్రాన్స్‌ఫర్ అవుతూ తన స్వంత ఊరికే రాగా, అక్కడ డే టైం లోనే డ్యూటీకి S.I ని ఒప్పించుకున్న హీరోకి అనుకోకుండా ఒక రోజు నైట్ డ్యూటీ పడుతుంది…
తన బ్యాడ్ టైం వలన ఆ రోజు ఓ హత్య జరుగుతుంది, ఆ హత్య తాలుకూ డీటైల్స్ పోలిస్ స్టేషన్ లో ఉండగా అక్కడ హీరో వాటిని కాపాడాల్సి వస్తుంది, కానీ క్రైం ఎవిడెన్స్ లు ఓ ముగ్గురు హీరో ఉన్న టైం లోనే తీసుకుపోతారు, రే చీకటి ఉన్న హీరో తర్వాత ఏం చేశాడు, ఆ ముగ్గిరినీ కనుక్కున్నాడా లేదా అన్నది మిగిలిన కథ…
ఓవరాల్ గా స్టొరీ పాయింట్ ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా టేకింగ్ పరంగా పూర్తిగా నిరాశ పరిచింది సినిమా, ఉన్నంతలో కిరణ్ అబ్బవరం ఆకట్టుకున్నా కానీ టేకింగ్ చాలా నీరసంగా ఉండటం, కథ నత్తనడకన సాగడంతో ఎలాగోలా ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించినా కానీ సెకెండ్ ఆఫ్ మాత్రం కంప్లీట్ గా ట్రాక్ తప్పి…
ఎటు నుండి ఏటో వెళుతూ ఎలాగోలా క్లైమాక్స్ కి చేరుకొని ఆ ట్విస్ట్ అయినా ఆకట్టుకుంటుంది అనుకుంటే అది చాలా సింపుల్ గా తేల్చేశారు, దాంతో ఆసక్తి కరమైన కథ పాయింట్ ని అతి సాదారణంగా తీసి నిరాశ పరిచారు అని చెప్పాలి. ఓవరాల్ గా అక్కడక్కడ లైట్ కామెడీ ఆకట్టుకున్నా, స్టొరీ పాయింట్ ఇంటరెస్ట్ ని క్రియేట్ చేయడం తప్పితే…
సినిమాలో మిగిలిన అంశాలు అన్నీ మైనస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ క్రియేట్ చేసిన ఇంటరెస్ట్ ను సినిమా థియేటర్స్ లో మెయిన్ టైన్ చేయలేక పోయింది, కష్టపడి ఓపికతో చూస్తె సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2 స్టార్స్…