శ్రీహాన్ సినిక్రీషన్స్ బ్యానర్ ఫై చంద్రప్రియ సుబుద్ధి నిర్మిస్తున్న డై హార్డ్ ఫ్యాన్ సినిమా నుంచి హీరో శివ ఆలపాటి ఫస్ట్ లుక్ పోస్టర్ కి విశేష స్పందన లభించింది. తెలుగు సినీ వర్గాలలో మరియు తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి స్పందన రావడం తో చిత్ర యూనిట్ లో సందడి నెలకొంది. ప్రతిభ ను గుర్తించి, ప్రోత్సహించడం లో ఎప్పుడు ముందు ఉండే AK Entertainments అధినేత అనిల్ సుంకర గారు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేయడం విశేషం.
ఈ సందర్భం గా శివ ఆలపాటి మాట్లాడుతూ, అనిల్ సుంకర గారు తన పోస్టర్ ని రిలీజ్ చేయడం తనుకు ఎంతో అననందాన్ని , ప్రోత్సహాహాన్ని ఇచ్చింది. ఒక కొత్త నటుడిగా పరిచయం అవుతున్న నాకు షూటింగ్ ప్రారంభం లో సీనియర్ నటులు షకలక శంకర్ గారు ,రాజీవ్ కనకాల గారు తనకు ఎంతో ధైర్యాన్ని , ప్రోత్సాహాన్ని అందించారు , తద్వారా నా నటనా పనితీరు ఎంతో మెరుగుపడింది.ఇండస్ట్రీ కి కొత్త గా వచ్చిన నాలాంటి వాళ్ళకి సీనియర్ లు ఈ విధం గా తమ సపోర్ట్ ను అందిచడం ఎంతో హర్షించదగ్గ విషయం.
సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టుప్రొడక్షన్ లో ఉంది. సినిమా నిర్మాణం లో ప్రొడ్యూసర్ చంద్రప్రియా సుబుద్ధి గారు ఎక్కడ రాజీ పడలేదు. సినిమా చాల బాగా వచ్చింది , ఈ సినిమా ప్రతి ఒక్కరు ఎంతగానో వారి కుటుంబాలతో కలిసి చూడదగినది.అతి త్వరలోనే ఈ సినిమాను థియేటర్స్ లో చూడొచ్చు.అభిరాం ఎం దర్శకత్వ బాధ్యతను చాల చక్కగా నిర్వర్తించారు. ఈ కథ లో పాత్రలు కల్పితం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన అభిరాం కు ఇది రెండవ చిత్రం. మధు పొన్నాస్ అందించిన చక్కని సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.