లాస్ట్ ఇయర్ SR కళ్యాణ మండపం సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు. ఆ సినిమా సాధించిన విజయం తో రెట్టించిన జోరు తో వరుస పెట్టి సినిమాలను ఒప్పుకున్న కిరణ్ అబ్బవరం అందులో భాగంగా ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు సెబాస్టియన్ PC 524 సినిమా తో ఆడియన్స్ ముందుకు రాగా….
ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా ప్రామిసింగ్ గా ఉంటుంది అన్న అంచనా అందరూ వేశారు, లాస్ట్ మూవీ SR కళ్యాణ మండపం బ్లాక్ బస్టర్ అవ్వడం తో ఈ సినిమా బిజినెస్ కూడా పోటి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఎక్స్ లెంట్ గా జరిగింది అని చెప్పాలి…
కానీ సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మెన్స్ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది అనే చెప్పాలి. రిలీజ్ అయిన మొదటి ఆటకే కంప్లీట్ గా నెగటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ని అయితే చూపించ లేక పోయింది అని చెప్పాలి…
మొత్తం మీద సినిమా మొదటి రోజు 31 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ వైడ్ గా 36 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వీకెండ్ మొత్తం మీద సినిమా మరో 20 లక్షల దాకా కలెక్షన్స్ ని యాడ్ చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా… మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుందట…
ఇక వరల్డ్ వైడ్ గా 56 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా సాధించిందట. అది కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ అని అంటున్నారు… ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్ల లోపు ఉంటుందని, సినిమా ఆ మార్క్ ని ఇక అందుకోవడం అసాధ్యం అని తెల్చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.