రెండేళ్ళ క్రితం మొదలైన పాండమిక్ వలన ఇండస్ట్రీలు అన్ని కూడా చాలా కష్టపడగా లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుండి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడం వాటిలో ఎక్కువ శాతం సినిమాలు హిట్స్ గా నిలవడంతో తిరిగి ఇండస్ట్రీ తేరుకుంటున్న టైం లో సమ్మర్ సినిమాల జోరు భారీగా స్టార్ట్ అవుతున్న టైం లో సెకెండ్ వేవ్ ఇంపాక్ట్ చూపడం స్టార్ట్ చేయగా అప్పటికి రిలీజ్ ను కన్ఫాం చేసుకున్న పవన్ కళ్యాణ్…
కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రలో టికెట్ రేట్స్ సమస్య వచ్చి పడింది, థియేటర్స్ లో తనిఖీలు, స్పెషల్ షోలు వేసినా, టికెట్ రేట్లు పెంచినా థియేటర్స్ సీజ్ చేయడం లాంటివి స్టార్ట్ అవ్వగా వకీల్ సాబ్ కి అటు సెకెండ్ వేవ్ ఇటు…
ఆంధ్రలో టికెట్ రేట్లు దెబ్బ కొట్టాయి… అప్పటి నుండి ఇండస్ట్రీ కి ఆంధ్రలో టికెట్ రేట్స్ సమస్య గా మారగా ఇండస్ట్రీ పెద్దలు ఎంతలా ట్రై చేసినా కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇలాంటి టైం లో భీమ్లా నాయక్ రిలీజ్ కి ముందు అంతా అనుకున్నట్లు జరిగి కొత్త జీవో రావాల్సింది కానీ…
కావాలని చేసినట్లు అనిపించేలా భీమ్లా నాయక్ స్లో అయ్యే దాకా ఎదురు చూసి తర్వాత కొత్త జీవో ని ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ చేసి అప్ కమింగ్ మూవీస్ అన్నింటికీ మరీ మునుపటి రేంజ్ లో కాకున్నా ప్రస్తుతం ఉన్న రేట్స్ కన్నా బెటర్ గా రేట్స్ ని ఇచ్చారు… కానీ ఓవరాల్ గా ఈ టైం పీరియడ్ లో పవన్ కళ్యాణ్ కి అప్పుడు వకీల్ సాబ్ తో…..
ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా తో ఈ టికెట్ రేట్స్ వలన గట్టి ఎదురు దెబ్బ తగిలింది… అయినా కానీ మిగిలిన స్టార్ హీరోలతో పోల్చితే టికెట్ రేట్స్ సమస్యలు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ నటించిన 2 సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడం తన గట్స్ కి నిదర్శనం అనే చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ వైజ్ గా మాత్రం 2 సినిమాలకు కూడా దెబ్బ మాత్రం తగిలింది అన్నది ఎవ్వరూ కాదనలేని నిజం.