పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ ఎక్స్ లెంట్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సెకెండ్ వీక్ లో కలెక్షన్స్ కోసం కష్టపడుతూ పరుగును కొనసాగిస్తుంది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అయిపొయింది, కలెక్షన్స్ పరంగా ఇక సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం….
దాదాపు అసాధ్యంగానే కనిపిస్తుంది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 13 వ రోజు కి వచ్చే సరికి 20 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోవచ్చు అనుకుంటే 18 లక్షల రేంజ్ షేర్ తోనే సరిపెట్టుకుంది సినిమా….
వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ లో డ్రాప్స్ ఎఫెక్ట్ వలన ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్ కి చాలా దూరంలోనే ఆగిపోయేలా ఉందని చెప్పాలి. ఇక కొత్త రిలీజ్ లు కూడా ఉండటంతో థియేటర్స్ చాలా వరకు ఆ సినిమాలకు వెళ్లి పోవడం ఖయామని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా…..
బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 34.60Cr(Without GST- 31.53Cr)
👉Ceeded: 10.98Cr
👉UA: 7.51Cr
👉East: 5.43Cr
👉West: 4.94Cr
👉Guntur: 5.18Cr
👉Krishna: 3.75Cr
👉Nellore: 2.53Cr
AP-TG Total:- 74.92CR(114.42Cr~ Gross)
👉KA+ROI: 8.20Cr
👉OS: 12.46Cr
Total World Wide: 95.58CR(155.55CR~ Gross)
మొత్తం మీద సినిమా ను 106.75 కోట్ల రేటు కి అమ్మగా 108 కోట్ల ఈవెన్ టార్గెట్ కి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 12.42 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం సినిమా పరిస్థితి చూస్తుంటే ఇక ఈ మార్క్ ని అందుకునే అవకాశం అయితే కనిపించడం లేదు అని చెప్పాలి.