రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఇప్పుడు మూడో రోజు…
రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి మంచి హోల్డ్ తో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా 2 వ రోజు తో పోల్చితే 15% టు 20% వరకు డ్రాప్ అయినా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా ఉండగా…
మంచి గ్రోత్ ని కూడా అన్ని సెంటర్స్ లో చూపిస్తూ దూసుకు పోతున్న సినిమా నైజాంలో మరో సారి మంచి హోల్డ్ ని సొంతం చేసుకోగా ఆంధ్రలో రెండో రోజు కన్నా కూడా కొంచం బెటర్ గా సినిమా హోల్డ్ చేసింది ఇప్పుడు… హిందీలో చాలా వరకు షోలు ది కాశ్మీర్ ఫైల్స్ కి వెళ్ళినా కానీ…
అక్కడ కూడా ఉన్నంతలో మూడో రోజు సినిమా ఇప్పుడు 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునేలా ఉందని సమాచారం, కర్ణాటకలో జస్ట్ ఓకే అనిపించుకునే బుకింగ్స్ ఉండగా మిగిలిన చోట్లా మినిమమ్ ఇంపాక్ట్ కూడా లేదు… మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 3 వ రోజున సినిమా 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని….
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మరోసారి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 11 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని చెప్పాలి…. ఓవరాల్ గా స్ప్రెడ్ అయిన సినిమా టాక్ దృశ్యా, సినిమా జానర్ దృశ్యా ఇది ఎక్స్ లెంట్ హోల్డ్ అనే చెప్పాలి. మరి అఫీషియల్ డే 3 కలెక్షన్స్ రెండో రోజు మాదిరిగా అంచనాలను మించిపోతాయో లేదో చూడాలి…