పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మూడో వీకెండ్ లో మంచి ట్రెండ్ ని చూపించింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో అయినా కానీ వీకెండ్స్ లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 3 వ వీకెండ్ శని మరియు ఆదివారాలలో సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి అని చెప్పాలి. సినిమా 16 వ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా 17 వ రోజు మరింత జోరు పెంచిన సినిమా చాలా చోట్ల షోలు పెరిగి పోగా కలెక్షన్స్ కూడా గ్రోత్ ని చూపించి మొత్తం మీద…
36 లక్షల దాకా షేర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా కి కృష్ణా మరియు నెల్లూరు ఏరియా లలో GST రిటర్న్ కలెక్షన్స్ యాడ్ అవ్వడంతో అది కూడా కలిసి వచ్చిన సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 17 రోజులు పూర్తీ అయ్యే టైం కి…
బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి…
👉Nizam: 34.86Cr(Without GST- 31.71Cr)
👉Ceeded: 11.12Cr
👉UA: 7.62Cr
👉East: 5.47Cr
👉West: 5.02Cr
👉Guntur: 5.24Cr
👉Krishna: 4.20Cr(inc GST)
👉Nellore: 2.80Cr(inc GST)
AP-TG Total:- 76.33CR(117Cr~ Gross)
👉KA+ROI: 8.23Cr
👉OS: 12.51Cr
Total World Wide: 97.07CR(158.16CR~ Gross)
మొత్తం మీద 97 కోట్ల మార్క్ ని అధిగమించిన సినిమా ఇప్పుడు 108 కోట్ల టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 10.93 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది, కాగా సినిమా ఆర్ ఆర్ ఆర్ వచ్చే టైం లో హోలీ హాలిడే అండ్ నెక్స్ట్ వీకెండ్ లు బాలెన్స్ ఉన్నాయి అని చెప్పాలి. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…