యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది… వీకెండ్ లో ఎలాగోలా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా 4 వ రోజు ఆల్ మోస్ట్ 80% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 5 వ రోజు కి వచ్చే సరికి …..
దారుణమైన డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఇక తేరుకునే అవకాశాలు అస్సలు కనిపించడం లేదు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల దాకా అయినా కలెక్షన్స్ ని సాధిస్తుంది అనుకుంటే…. ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెట్టలేక…
పోయిన రాధే శ్యామ్ కేవలం 1.14 కోట్ల షేర్ తోనే 5 వ రోజును సరిపెట్టుకుంది. అంటే ఏకంగా ఆల్ మోస్ట్ 1 కోటి దాకా డ్రాప్స్ ను 5 వ రోజు సొంతం చేసుకుంది ఈ సినిమా… ఇక మొత్తం మీద సినిమా ఇప్పుడు 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 23.79Cr(inc GST)
👉Ceeded: 7.10Cr
👉UA: 4.58Cr
👉East: 4.11Cr
👉West: 3.17Cr
👉Guntur: 4.30Cr
👉Krishna: 2.54Cr
👉Nellore: 2.05Cr
AP-TG Total:- 51.64CR(80.45CR~ Gross)
👉Karnataka: 4.15Cr
👉Tamilnadu: 0.71Cr
👉Kerala: 0.16Cr
👉Hindi: 8.00Cr
👉ROI: 1.52Cr
👉OS – 11.02Cr
Total WW: 77.20CR(138CR~ Gross)
ఇదీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజుల్లో సినిమా పరిస్థితి…
అందుకోవాల్సిన టార్గెట్ కొండంత ఉంది…. 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ దరిదాపుల్లోకి కూడా ఇప్పుడు సినిమా వెళ్ళే అవకాశాలు కనిపించడం లేదు సరికదా అందులో సగం కూడా రికవరీ చేసే అవకాశం కనిపించడం లేదు…. క్లీన్ హిట్ కోసం ఇంకా 126.80 కోట్ల షేర్ ని సినిమా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది… అది జరగాలి అంటే ఏదైనా అద్బుతం జరగాలి.