పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్, రిలీజ్ కి ముందు విపరీతమైన అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆ అంచనాలను నిలబెట్టుకున్న ఈ సినిమా మొదటి వీకెండ్ లో ఊహకందని కలెక్షన్స్ ని సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అవ్వడం మొదలు పెట్టగా ఆ ఇంపాక్ట్ తర్వాత ప్రతీ వీకెండ్ లో మంచి కలెక్షన్స్ రావడం…
తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మళ్ళీ భారీగా స్లో డౌన్ అవ్వడం లాంటివి జరుగుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ కి ఇంకా దూరంగానే ఉండి పోయింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర భీమ్లా నాయక్ సినిమా ఇప్పుడు మూడో వారాన్ని….
పూర్తీ చేసుకుని నాలుగో వారంలో ఎంటర్ అవ్వగా నాలుగో వారం లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక మూడో వారం లో సినిమా 97 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది… ఇక 21 వ రోజు 3 లక్షల షేర్ ని అందుకుంది. ఓవరాల్ గా 3 వారాల్లో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 34.95Cr(Without GST- 31.80Cr)
👉Ceeded: 11.17Cr
👉UA: 7.64Cr
👉East: 5.49Cr
👉West: 5.08Cr
👉Guntur: 5.26Cr
👉Krishna: 4.22Cr(inc GST)
👉Nellore: 2.80Cr(inc GST)
AP-TG Total:- 76.61CR(117.44Cr~ Gross)
👉KA+ROI: 8.23Cr
👉OS: 12.52Cr
Total World Wide: 97.36CR(158.64CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 3 వారాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…
మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 106.75 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మొత్తం మీద 3 వారాల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 10.64 కోట్ల షేర్ దూరంలో సినిమా ఉంది, ఇక ఈ కలెక్షన్స్ ని సినిమా అందుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర…