యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ రాధే శ్యామ్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వీకెండ్ లో ఎలాగోలా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే టప్పటికి మాత్రం కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. అసలు ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపలేక పోయిన సినిమా…
రోజు రోజు కి స్లో అయ్యి ఇప్పుడు రెండో వారంలో భారీగా థియేటర్స్ ని కోల్పోవాల్సి వచ్చింది. సినిమా రిలీజ్ రోజున మొత్తం మీద 920 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు రెండో వారానికి వచ్చే సరికి నైజాంలో 180 థియేటర్స్ లో సీడెడ్ లో 95 థియేటర్స్ లో…
టోటల్ ఆంధ్రలో 230 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. అంటే దాదాపు 505 థియేటర్స్ లో రెండో వారాన్ని కొనసాగిస్తున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఈ హోల్డ్ సరిపోదు కలెక్షన్స్ సరిపోవు అని చెప్పాలి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇక సినిమా తేరుకునే అవకాశం అయితే కనిపించడం లేదు ఇప్పుడు…