పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నాలుగో వారంలో అడుగు పెట్టగా సినిమా ఇప్పుడు డిజిటల్ లో కూడా రిలీజ్ అవ్వడం కన్ఫాం అయిపొయింది…. సినిమా రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఒకే సారి రిలీజ్ అవ్వడం కన్ఫాం అయింది. సినిమా ఇప్పుడు ఈ నెల 25న అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇటు ఆహా వీడియో లో…
ఒకేసారి డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది. ఇక సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి వారం గ్యాప్ ఉండగా ఈ వారంలో థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా తెలుగు రాష్ట్రాలలో మూడో వారంలో 240 థియేటర్స్ లో…
పరుగును కొనసాగిస్తే… ఇప్పుడు నాలుగో వారానికి వచ్చే సరికి 140 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. ఈ చివరి వారంలో సినిమా కి హోళీ హాలిడే అండ్ వీకెండ్ ఉండటంతో మిగిలిన టార్గెట్ లో ఎంతో కొంత రికవరీ చేసినా కూడా నష్టాన్ని తగ్గించే అవకాశం ఎంతో కొంత ఉంటుంది అని చెప్పాలి. మరి ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి…