బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పై తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అంచనాలు ఉండగా ఇతర చోట్లా సంక్రాంతి టైం లో సాలిడ్ గా హైప్ ఉండేది కానీ థార్డ్ వేవ్ వలన అక్కడ కొంచం స్లో అయినా తిరిగి ఇప్పుడు న్యూ రిలీజ్ టైం కి అన్ని చోట్లా ఆర్ ఆర్ ఆర్ టీం తిరిగి సినిమా కి సాలిడ్ బజ్ వచ్చేలా…
ప్లాన్ చేయడంతో మళ్ళీ అన్ని చోట్లా బజ్ పెరిగి పోయింది. ఇక మెయిన్ మార్కెట్ ఏరియా అయిన తెలుగు రాష్ట్రాలలో సినిమా కి ఇప్పుడు రెండు చోట్లా భారీ టికెట్ హైక్స్ స్పెషల్ షోలు ఇలా కావలసినన్ని పర్మీషన్స్ అన్నీ కూడా దొరకగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా…
టికెట్ హైక్స్ కోసం టోటల్ బడ్జెట్ డీటైల్స్ లాంటివి అడిగిన తర్వాత అన్ని వివరాలను పరీశిలించి భారీ టికెట్ హైక్స్ ని గ్రాంట్ చేసింది. ఆ లెక్కల ప్రకారం సినిమా కి అందరి రెమ్యునరేషన్ లు కాకుండా ఓవరాల్ గా అయిన బడ్జెట్ వింటే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం…
ఎవ్వరి ఊహకు అందని విధంగా కేవలం సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఏకంగా 336 కోట్ల మార్క్ ని అందుకుందని సమాచారం. అందరి రెమ్యునరేషన్ కాకుండా అయిన ప్రొడక్షన్ కాస్ట్ ఈ రేంజ్ లో ఉండగా అందరి రెమ్యునరేషన్స్ తో సినిమా ఓవరాల్ బడ్జెట్ లెక్క 500 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు… ఇందులోనే ఇప్పుడు భారీగా జరిగిన జరుగుతున్నా ప్రమోషన్స్ కి కూడా కలిపి…
ఈ రేంజ్ బడ్జెట్ లో సినిమా నిర్మాణం అయిందని సమాచారం. ఇండియన్ సినిమా హిస్టరీలో కేవలం ప్రొడక్షన్ కాస్ట్ కే ఈ రేంజ్ బడ్జెట్ అయిన సినిమా గా ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా ఎలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కోసి దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి ఇక…