యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి తొలిరోజు కలెక్షన్స్ పరంగా ఆల్ టైం రికార్డులను తిరగరాసి ఊచకోత అంటే ఇదే అనిపించుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో అంచనాలను అన్నీ కూడా మించి పోయి తొలిరోజు కలెక్షన్స్ పరంగా ప్రీవియస్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా 65 కోట్ల దాకా కలెక్షన్స్ ని…
మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా ఆ అంచనాలను కంప్లీట్ గా మించి పోయి బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్ల మార్క్ ని కూడా దాటేసి ఏకంగా 74 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది… మొత్తం మీద సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 23.35Cr
👉Ceeded: 17Cr
👉UA: 7.42Cr
👉East: 5.39Cr
👉West: 5.93Cr
👉Guntur: 7.80Cr
👉Krishna: 4.21Cr
👉Nellore: 3.01Cr
AP-TG Total:- 74.11CR
ఇదీ మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన చారిత్రిక కలెక్షన్స్ రికార్డులు…. బాహుబలి 2 మూవీ 43 కోట్ల షేర్ ని అందుకుంటే….
ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఏకంగా 31 కోట్ల షేర్ ని అధికంగా సొంతం చేసుకుని మొదటి రోజు చరిత్ర సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక ఓవరాల్ గా హైర్స్ ఎన్ని ఇతర రాష్ట్రాల కలెక్షన్స్, హిందీ కలెక్షన్స్, ఓవర్సీస్ కలెక్షన్స్ అండ్ టోటల్ గ్రాస్ లెక్కలు అన్నీ కూడా క్లియర్ గా ఏరియాల వారి రిపోర్ట్స్ ని మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం. ఆ ఆర్టికల్ కోసం ఎదురు చూడండి…