బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంది ఆర్ ఆర్ ఆర్ మూవీ… యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎక్స్ లెంట్ మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత మొదటి వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా సినిమా కి భారీగా ఉన్న టికెట్ హైక్స్ ని….
వర్కింగ్ డేస్ వలన కొద్ది వరకు తగ్గించారు… అయినా కానీ ఇప్పటికీ చాలా వరకు సినిమాలతో పోల్చితే ఇవి ఇంకా ఎక్కువ రేట్స్ అనే చెప్పాలి… ఆ ఇంపాక్ట్ వలన కాలేజ్ స్టూడెంట్స్ అండ్ కామన్ ఆడియన్స్ మరీ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాలేక పోతున్నారు…
దాంతో ఆక్యుపెన్సీ మరీ ఎక్కువ లేకున్నా కానీ టికెట్ హైక్స్ వలన కలెక్షన్స్ సాలిడ్ గానే ఉండే అవకాశం ఉంది, ఓవరాల్ గా 3 వ రోజు తో పోల్చితే నాలుగో రోజు డ్రాప్స్ 50% కి పైగానే ఉన్నాయి అని చెప్పాలి… ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా డ్రాప్స్ గట్టిగానే ఇంపాక్ట్ చూపాయి…
అయినా కానీ సినిమా ఇప్పుడు నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూ ఉండే అవకాశం ఉంది, ఇక హిందీ లో నాలుగో రోజు ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండగా…
ఈ రోజు సినిమా 15-16 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు…. ఓవరాల్ గా సినిమా 4 వ రోజు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఇండియాలో బంద్ ఎఫెక్ట్ వలన కేరళ మరియు ఇతర స్టేట్స్ లో కలెక్షన్స్ ఎఫెక్ట్ ఉందని చెప్పాలి. కానీ ఆ ఇంపాక్ట్ ఓవరాల్ డే 4 కలెక్షన్స్ పై ఎంత వరకు ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి… డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.