టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హైప్ నడుమ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా వీకెండ్స్ లో కలెక్షన్స్ సాలిడ్ గా వచ్చినా కానీ వర్కింగ్ డేస్ లో ఎప్పటికప్పుడు స్లో డౌన్ అవుతూ వచ్చిన భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర…
పరుగును కష్టతరం చేసుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకునే దిశగా అడుగులు వేయలేక పోయిన సినిమా ఓవరాల్ గా టార్గెట్ కి దూరంగానే పరుగును ఆపేసింది, పాజిటివ్ టాక్ తో కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడంలో విఫలం అయింది భీమ్లా నాయక్ సినిమా… దానికి మరో ఎఫెక్ట్ గా…
ఆంధ్రలో టికెట్ రేట్స్ భారీగా ఈ సినిమా కి తగ్గించడం, స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు లాంటివి పడకుండా ప్రభుత్వ ఉద్యోగులు థియేటర్స్ కి వచ్చి తనిఖీలు చేయడం ఈ సినిమా కే చెల్లింది. ఇవన్నీ ఎఫెక్ట్ చూపి ఓవరాల్ కలెక్షన్స్ తగ్గగా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది ఈ సినిమా…
మొత్తం మీద సినిమా టోటల్ రన్ పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 35.02Cr(Without GST- 31.85Cr)
👉Ceeded: 11.22Cr
👉UA: 7.65Cr
👉East: 5.49Cr
👉West: 5.11Cr
👉Guntur: 5.26Cr
👉Krishna: 4.29Cr(inc GST)
👉Nellore: 2.80Cr(inc GST)
AP-TG Total:- 76.84CR(117.85Cr~ Gross)
👉KA+ROI: 8.24Cr
👉OS: 12.55Cr
Total World Wide: 97.63CR(159.10CR~ Gross)(90%+ Recovery)
మొత్తం మీద సినిమా ను 106.75 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మొత్తం మీద 10.37 కోట్లు నష్టపోయి 90% రికవరీ తో ఎబో యావరేజ్ గా పరుగును ముగించింది, వర్కింగ్ డేస్ లో కొంచం హోల్డ్ చేసి ఉన్నా కూడా సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ ని అందుకుని ఉండేది…