మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఓవరాల్ గా మొదటి వారాన్ని ఘనంగా పూర్తీ చేసుకుంది. సినిమా 6 వ రోజు కొంచం అంచనాలు తప్పినా కానీ 7 వ రోజు మాత్రం తిరిగి పుంజుకుని మంచి గ్రోత్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపి అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 7వ రోజున 6.5 కోట్ల రేంజ్ లో…
కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఓవరాల్ గా రోజు ను ఘనంగా ముగించి ఆల్ మోస్ట్ 1 కోటి రేంజ్ లో గ్రోత్ ని చూపెట్టి ఏకంగా 7.48 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని 7వ రోజున దుమ్ము లేపింది. ఇక హిందీ లో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా…
కర్ణాటక మరియు తమిళనాడులలో కూడా మంచి వసూళ్ళతో మొదటి వారాన్ని ముగించింది, కర్ణాటకలో ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా కేరళలో 4-5 రోజుల్లో స్ట్రైక్ వలన ఇబ్బందులు ఎదురు అయినా మొత్తం మీద మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తో ముగించింది.
ఓవరాల్ గా సినిమా ఇప్పుడు మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 77.22Cr
👉Ceeded: 37.28Cr
👉UA: 20.97Cr
👉East: 11.16Cr
👉West: 9.76Cr
👉Guntur: 14.03Cr
👉Krishna: 10.78Cr
👉Nellore: 6.45Cr
AP-TG Total:- 187.65CR(279.50CR~ Gross)
👉KA: 27.75Cr
👉Tamilnadu: 25.30Cr
👉Kerala: 8.00Cr~
👉Hindi: 65.60Cr
👉ROI: 5.10Cr
👉OS – 73.45Cr
Total WW: 392.85CR (Gross- 710CR~)
సినిమాను మొత్తం మీద 451 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 60.15 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అంటే సినిమా ఇక ఈ వీకెండ్ లో మినిమమ్ జోష్ చూపెట్టినా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.