బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ మూవీ కేరళలో భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కానీ 4-5 రోజుల్లో భారత్ బంద్ వలన సినిమా థియేటర్స్ ని మూసెయ్యడంతో సినిమాకి ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడింది… అయినా కానీ తర్వాత తేరుకున్న సినిమా మిగిలిన రోజుల్లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
కేరళలో 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి 21 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా ని కేరళలో మొత్తం మీద 9 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా పబ్లిసిటీ ఖర్చులతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9.50 కోట్ల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజుల తర్వాత సినిమా బిజినెస్ ను దాటేసి 9.45 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 12 వ రోజు కలెక్షన్స్ తో అక్కడ లాభాలను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. ఇక బీస్ట్, KGF2 సినిమాలు వచ్చే వరకు ఆర్ ఆర్ ఆర్ మంచి షేర్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.