యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సెకెండ్ వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి మళ్ళీ ఎంటర్ అయిన ఈ సినిమా 11వ రోజు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. సినిమా 55%-60% వరకు…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఏకంగా 70% కి పైగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంది సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక 12వ రోజు పార్షిక హాలిడే ఉండటంతో ఉన్నంతలో కొంచం ఎక్కువ డ్రాప్స్ రాలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్ లో…
హోల్డ్ ని సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 4.2 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉంది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే… అన్ని చోట్లా లెక్కలు కొంచం ఎక్కువ ఉంటే 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక హిందీ లో ఈ రోజు మరోసారి 6 కోట్ల నుండి…
6.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలు కలుపి మొత్తం మీద ఇండియాలో 12 వ రోజు మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి సినిమా 11.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా…
ఆల్ మోస్ట్ 11 వ రోజు లెవల్ లో ఇప్పుడు అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 12 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా 12వ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద పార్షిక హాలిడేని మరీ అద్బుతం అనిపించే రేంజ్ లో వాడుకోక పోయినా ఉన్నంతలో డీసెంట్ హోల్డ్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక 12 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.