బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా డిసాస్టర్ టాక్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, కానీ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ లవ్ స్టొరీ అవ్వడం పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కమర్షియల్ ఎలిమెంట్స్ అస్సలు లేక పోవడంతో అసలు ఆడియన్స్ ఈ సినిమా కి కనెక్ట్ అవ్వలేక పోయారు. సాంగ్స్ బాగున్నా విజువల్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నా…
జనాలు రాధే శ్యామ్ సినిమాలు అసలు పట్టించుకోలేదు. సినిమా మొదటి వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన సినిమా ఏ దశలో కూడా మమ్మోత్ బిజినెస్ ను అందుకోలేదు… సినిమా టోటల్ బిజినెస్ వాల్యూ 202.80 కోట్లు కాగా…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 204 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వీకెండ్ తర్వాత కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచి ఇప్పుడు టాలీవుడ్ హిస్టరీలోనే కాదు ఇండియన్ సినిమా….
హిస్టరీ లో ఆల్ టైం ఎపిక్ బిగ్గెస్ట్ లాస్ మూవీ గా నిలిచి ప్రభాస్ పేరిట బ్యాడ్ రికార్డ్ వచ్చేలా చేసింది… ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 24.80Cr(inc GST)
👉Ceeded: 7.46Cr
👉UA: 4.90Cr
👉East: 4.34Cr
👉West: 3.32Cr
👉Guntur: 4.50Cr
👉Krishna: 2.71Cr
👉Nellore: 2.14Cr
AP-TG Total:- 54.17CR(84.58CR~ Gross)
👉Karnataka: 4.25Cr
👉Tamilnadu: 0.78Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 10.68Cr
👉ROI: 1.69Cr
👉OS – 11.45Cr
Total WW: 83.20CR(151.50CR~ Gross)
ఇదీ టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. 204 కోట్ల టార్గెట్ కి సినిమా ఆల్ మోస్ట్ 120.80 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని చరిత్ర కెక్కె డిసాస్టర్ గా నిలిచింది… సినిమా మరీ ఈ రేంజ్ ఫ్లాఫ్ ఏమాత్రం అవ్వాల్సింది కాదు కానీ పరిస్థితులు ఇలాంటి ఎదురుదెబ్బ తీశాయి అని చెప్పాలి.