బాక్స్ ఆఫీస్ దగ్గర దళపతి విజయ్ నటించిన మూవీ బీస్ట్ వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మొత్తం మీద 505 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా మొత్తం మీద 10.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది… ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఆల్ రెడీ మొదలు అవ్వగా….
తెలుగు రాష్ట్రాల్లో సినిమా బుకింగ్స్ ఇది వరకు విజయ్ నటించిన మాస్టర్ మూవీ బుకింగ్స్ తో పోల్చితే 50% కన్నా తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతం…. టికెట్ హైక్స్ కూడా భారీగా పెట్టడం ఎఫెక్ట్ చూపుతూ ఉండటంతో ఆక్యుపెన్సీ పై ఆ ఎఫెక్ట్ ఉంది… మొత్తం మీద సినిమా….
ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని బట్టి తెలుగు రాష్ట్రాల్లో 2.2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయితే 3 కోట్ల రేంజ్ లో అంతకన్నా మించి ముందుకు వెళ్ళొచ్చు. ఇక తమిళనాడులో రికార్డ్ బ్రేకిగ్ అనిపించే రేంజ్ లో బుకింగ్స్ తో…
దూసుకు పోతున్న బీస్ట్ మూవీ ఇప్పుడు 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక మరియు కేరళలో సినిమా 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ వేరు వేరుగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా కలెక్షన్స్ తో మొదటి రోజు 48 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
సినిమా ఓవర్సీస్ లో కొన్ని చోట్లా బ్యాన్ అయినా కానీ 20 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను అందుకోవచ్చు. మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా బుకింగ్స్ ని బట్టి టాక్ ని బట్టి కలెక్షన్స్ షో షోకి ఇంప్రూవ్ చేసుకుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ జోరు చూపిస్తుందో చూడాలి.