బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ టోటల్ ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి. చాలా వరకు పెద్ద సినిమాలకు టాక్ ఎలా ఉన్నా కానీ మొదటి వీకెండ్ వరకు బుకింగ్స్ డీసెంట్ టు ఎక్స్ లెంట్ గా…
జరుగుతాయి కానీ ఆచార్య విషయంలో ఫస్ట్ డే నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం ఆశించిన మేర లేక పోవడంతో మొదటి రోజు నుండే అంచనాలను తప్పగా రెండో రోజు బుకింగ్స్ కూడా అస్సలు కూడా లేక పోవడం అండ్ దానికి తోడూ టాక్ కూడా మిక్సుడ్ కూడా ఉండటంతో…..
రెండో రోజు కలెక్షన్స్ కూడా తీవ్రంగా నిరాశ పరచగా రీసెంట్ టైం లో స్టార్ హీరోలలో లోవేస్ట్ సెకెండ్ డే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఆచార్య సినిమా కరోనా వేవ్ ల తర్వాత రిలీజ్ అయిన మూవీస్ లలో కూడా రెండో రోజు లోవేస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలలో…
లాస్ట్ ప్లేస్ లో నిలిచింది అని చెప్పాలి. మొత్తం మీద రెండో రోజు పండమిక్ తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉#RRR- 31.63CR
👉#Pushpa – 13.70Cr
👉#KGF2(Dub)- 13.37CR
👉#BheemlaNayak- 13.14Cr
👉#RadheShyam- 12.32Cr
👉#VakeelSaab- 10.74Cr
👉#Bangarraju- 7.79Cr
👉#Uppena- 6.86Cr
👉#Akhanda- 6.83Cr
👉#Acharya- 5.15Cr****
👉#Lovestory-5.08Cr
ఈ లిస్టులో ఉన్న సినిమాల్లో…. డిసాస్టర్ అయిన రాధే శ్యామ్ బెటర్ కలెక్షన్స్ ని సాధించగా….
కొన్ని సినిమాలు 50% ఆక్యుపెన్సీ తో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సాధించగా కొన్ని సినిమాలకు టికెట్ హైక్స్ కూడా లేవు… కానీ టికెట్ హైక్స్, సోలో రిలీజ్ ఉన్న ఆచార్య సినిమా డిసాస్టరస్ కలెక్షన్స్ ని రెండో రోజు సొంతం చేసుకుని రీసెంట్ టైం లో దారుణమైన రికార్డ్ ను సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ చేసింది అని చెప్పాలి…