బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరచగా సినిమా రెండో రోజు భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ మరియు మే డే హాలిడే కూడా ఉన్నప్పటికీ కూడా….
ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపలేక పోయింది. సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో 3వ రోజు మొత్తం మీద 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా మొత్తం మీద 3వ రోజు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా…
4.07 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 4.45 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా 3వ రోజు టోటల్ గ్రాస్ 7.80 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది. తీవ్రంగా నిరాశ పరిచిన సినిమా మొత్తం మీద 3 రోజుల వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 11.56Cr
👉Ceeded: 5.87Cr
👉UA: 4.68Cr
👉East: 3.18Cr
👉West: 3.27Cr
👉Guntur: 4.52Cr
👉Krishna: 2.84Cr
👉Nellore: 2.80Cr
AP-TG Total:- 38.72CR(55.90CR~ Gross)
Ka+ROI – 2.45Cr~
👉OS – 4.35Cr
Total WW: 45.52CR (70.65CR~ Gross)
ఇదీ మొత్తం మీద మొదటి వీకెండ్ లో ఆచార్య సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్క. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
131.20 కోట్ల బిజినెస్ కి 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆచార్య సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే ఇంకా 86.98 కోట్ల షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది… సినిమా 4వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా ఇక ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తుందో చూడాలి ఇక…