బాక్స్ ఆఫీస్ దగ్గర ఆచార్య సినిమా కలెక్షన్స్ ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెట్టడం లేదు… ఒకప్పుడు ఖైదీ నంబర్ 150 తో ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుండే రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ తర్వాత సైరా నరసింహా రెడ్డి తో కూడా దుమ్ము దుమారం లేపగా ఇటు పక్క రంగస్థలం తో సంచలనం సృష్టించిన రామ్ చరణ్ వినయ విదేయ రామతో భారీ ఎదురుదెబ్బ తిన్నా కానీ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేసిన….
ఆర్ ఆర్ ఆర్ తో రికార్డులను తిరగరాసిన తర్వాత ఆడియన్స్ ముందుకు అపజయం అంటే తెలియని కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య మాత్రం ఆడియన్స్ ని థియేటర్స్ కి అస్సలు తీసుకు రాలేక పోతుంది. సినిమా ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా…
తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు బ్యాడ్ రికార్డులను నమోదు చేస్తుంది. ఓవర్సీస్ లో సినిమా 12 కోట్ల రేటుని సొంతం చేసుకోగా అందులో ఎక్కువ శాతం కలెక్షన్స్ వచ్చే అమెరికాలో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి మొత్తం మీద….
817K డాలర్స్ తో మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు అనిపించిన ఆచార్య సినిమా తర్వాత టాక్ ఇంపాక్ట్ వలన కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది…రెండో రోజు 90 వేల డాలర్స్, మూడో రోజు 34 వేల డాలర్స్ మరియు నాలుగో రోజు 10 వేల డాలర్స్ తో సరిపెట్టుకుని టోటల్ గా ఇప్పటి వరకు 951K డాలర్స్ ని మాత్రమే అందుకోగా లాంగ్ రన్ లో 1 మిలియన్ ని కూడా…
అందుకోలేని పరిస్థితిని దక్కించుకుంది, ఈ వీకెండ్ లో హాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతూ ఉండటంతో ఇక ఆచార్య అక్కడ కూడా భారీ నష్టాలతో నిలవబోతుండగా ఓవరాల్ గా సినిమా లాస్ ఇప్పుడు అన్నీ కలుపుకుని చరిత్రలో నిలిచిపోవడానికి సిద్ధం అవుతున్నాయి…