బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య సినిమా మొదటి వారాన్ని అతి కష్టం మీద ముగించుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ డే నుండే నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగించగా సినిమా వీక్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసి ఇక తేరుకోలేక పోయింది సినిమా…..
మొత్తం మీద సినిమా మొదటి వారం మొత్తం మీద 48 కోట్ల లోపే షేర్ ని సొంతం చేసుకుంది వరల్డ్ వైడ్ గా…. కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సిన టార్గెట్ కొండంత ఉండగా ఆ టార్గెట్ ను ఇక సినిమా అందుకునే అవకాశం అస్సలు లేదు అనే చెప్పాలి…
ఓవరాల్ గా సినిమా 132.50 కోట్ల టార్గెట్ లో అత్యంత భారీ నష్టాలను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుండగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో మొదటి రోజు యాడ్ అయిన హైర్స్ కలెక్షన్స్ లెక్క మొత్తం మీద 10.81 కోట్ల రేంజ్ లో ఉండటంతో ఆ హైర్స్ చేసిన వాళ్ళు అందరూ కూడా….
భారీగా నష్టాలను సొంతం చేసుకోబోతుంది… ఇక ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ లో హైర్స్ ని తీసేస్తే మొత్తం మీద కలెక్షన్స్ లెక్క 37 కోట్ల రేంజ్ లోనే ఉండటం సినిమా ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది అన్న దానికి నిదర్శనం అని చెప్పాలి. రీసెంట్ టైం లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచి ఉండదు అనే చెప్పాలి…
సినిమాను భారీ రేటుకు కొన్న బయ్యర్స్ అలాగే హైర్స్ కట్టి కొన్న వాళ్ళు అందరూ కూడా తీవ్రంగా నష్టపోవడానికి సిద్ధమవుతూ ఉండగా త్వరలోనే సినిమా టీం డిస్ట్రిబ్యూటర్లకి కొంత అమౌంట్ ని రిటర్న్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు… అయినా కానీ రీసెంట్ టైం లో ఓన్లీ బిజినెస్ పరంగా టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం ఎపిక్ లాస్ మూవీగా ఆచార్య నిలవబోతుంది…