బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య మొదటి వారాన్ని అతి కష్టం మీద ముగించుకుని రెండో వారంలో అడుగు పెట్టగా సినిమా 8 వ రోజు కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన అన్ని చోట్లా మరింత స్లో డౌన్ అయింది. ఆల్ రెడీ సినిమా కి లో షేర్స్ ని రిపోర్ట్ చేస్తూ ఉండగా ఇప్పుడు…
8వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి మరి తక్కువ షేర్స్ ని రిపోర్ట్ చేయబోతుంది. తెలుగు రాష్ట్రాలలో చాలా సెంటర్స్ లో సినిమా జీరో షేర్స్ ని సొంతం చేసుకోబోతుండగా ఓవరాల్ గా 8 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సినిమా…
6-8 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఈ సినిమా కన్నా 43 వ రోజులో ఉన్న ఆర్ ఆర్ ఆర్ మూవీ బెటర్ షేర్స్ ని మరోసారి అందుకోబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోబోతున్న ఆచార్య బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ నష్టాలతో ఇప్పుడు చరిత్ర కెక్కడం ఖాయంగా మారింది.