లాస్ట్ ఇయర్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో చిన్న సినిమానే అయినా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా రాజ రాజ చోర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీ విష్ణు ఇక తన మార్కెట్ ని పెంచుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ శ్రీ విష్ణు ఆ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మరో సినిమా అర్జున ఫాల్గుణ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది…
ఇక ఈ సినిమా తర్వాత మరోసారి శ్రీ విష్ణు నుండి వచ్చిన కొత్త సినిమా భళా తందనానా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి అసలు మినిమమ్ బజ్ కూడా క్రియేట్ అవ్వలేదు కానీ ఓవరాల్ గా సినిమా బిజినెస్ వాల్యూ రేంజ్ 2.7 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకోగా…
సినిమా 3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా మొదటి ఆటకే కంప్లీట్ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ దశలో కూడా ఇక తేరుకోలేక పోయింది. తక్కువ సెంటర్స్ లోనే రిలీజ్ అయినా కానీ…
చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుంటూ 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర పట్టుమని 25 లక్షల రేంజ్ షేర్ ని కూడా అందుకోలేక పోయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సరైన సినిమాలను ఎంచుకోవడంలో విఫలం అయిన శ్రీ విష్ణుకి అర్జున ఫాల్గుణ తర్వాత ఇప్పుడు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర….
నిరాశ కలిగించే రిజల్ట్ సొంతం అయ్యిందని చెప్పాలి, మూడో రోజు ఆదివారం అయినా కానీ సినిమా షోలకి జనాలు రాకపోవడంతో వాల్యూ బిజినెస్ కి చాలా దూరంలోనే ఆగిపోబోతున్న సినిమా ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం చాలా తక్కువే ఉందని చెప్పాలి ఇప్పుడు.