టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ 4 రోజుల ముందు నుండే స్టార్ట్ అవ్వగా సినిమా కి నైజాం ఏరియాలో ఎక్స్ లెంట్ బుకింగ్స్ జరిగాయి.. సిటీలలో సూపర్ సాలిడ్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమా విలేజెస్ లో మట్టుకు అనుకున్న రేంజ్ లో….
అయితే బుకింగ్స్ ని సొంతం చేసుకోలేదు, దాంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతున్న సినిమా టాక్ బాగుంటే ఆఫ్ లైన్ కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ సాలిడ్ గా ఉండే ఛాన్స్ ఉంది. అయినా కానీ హైదరాబాదు లో సినిమా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ జరగగా….
టోటల్ నైజాం లో అడ్వాన్స్ బుకింగ్స్ 9.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోవడం విశేషం అవ్వగా ఓవరాల్ గా ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్ నాన్ RRR రికార్డులు నమోదు చేసే ఛాన్స్ ఎంతైనా ఉంది, ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో డీసెంట్ అనిపించుకునే బుకింగ్స్ ఉన్నాయి…
దానికి తోడూ సడెన్ వర్షాల ఎఫెక్ట్ అండ్ విలేజెస్ లో బుకింగ్స్ పై ఇంపాక్ట్ చూపగా ఓవరాల్ గా మౌత్ టాక్ అండ్ ఆఫ్ లైన్ కౌంటర్ సేల్స్ జోరు చూపించే అవకాశం ఉంది… మొత్తం మీద సినిమా మొదటి రోజు బుకింగ్స్ రీసెంట్ మూవీస్ తో పోల్చి చెప్పాలి అంటే ఆచార్య, రాధే శ్యామ్ కంటే బెటర్ గా భీమ్లా నాయక్ కంటే తక్కువగా ఉన్నాయి కానీ భీమ్లా నాయక్ కి AP లో టికెట్ హైక్స్ లేవు…మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని అంచనా వేసి చెప్పాలి అంటే 27-28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…. ఇక టాక్ ని బట్టి ఆఫ్ లైన్ కౌంటర్ టికెట్ సేల్స్ ని బట్టి షేర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉండగా, కొన్ని సెంటర్స్ లో హైర్స్ కూడా యాడ్ కాబోతున్నాయి…
ఇక కర్ణాటకలో బుకింగ్స్ డీసెంట్ గా ఉండగా ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయం, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మౌత్ టాక్ ని బట్టి కలెక్షన్స్ లెక్క ఇంకా జోరు చూపించే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఇదే రేంజ్ లో ఉంటాయో లేవో చూడాలి ఇక.