ఎనర్జిటిక్ స్టార్ టు ఉస్తాద్ గా మారిన రామ్ పోతినేని బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైం నుండి ఓ బిగ్ మాస్ హిట్ కొట్టాలి అని ఆశగా ఉండగా ఆ ఆశ రెండేళ్ళ క్రితం ఇస్మార్ట్ శంకర్ సినిమా తో తీరగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన రెడ్ ది ఫిల్మ్ అనుకున్న రేంజ్ లో టాక్ సొంతం అవ్వక పోయినా కానీ…
సంక్రాంతి హాలిడేస్ ను ఓ రేంజ్ లో వాడుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న రామ్ తెలుగు తో పాటు తమిళ్ లో బైలింగువల్ ప్రాజెక్ట్ గా కోలివుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ సినిమాను ఓకే చేశాడు…
ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు జులై లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.
ఇక సినిమా క్వాలిటీ చాలా బాగా ఉంటుందని ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండబోతున్నాయి అని టీసర్ క్వాలిటీ చూసిన తర్వాత కన్ఫాం అవ్వగా ఓవరాల్ గా ఈ సినిమా కోసం ఏకంగా 70 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను పెట్టి తీస్తున్నారని సమాచారం అందుతుంది. రామ్ కెరీర్ లోనే ఇప్పటి వరకు ఏ సినిమా కి కూడా పెట్టని భారీ బడ్జెట్ ఇది…
ఈ రేంజ్ బడ్జెట్ ను రికవరీ చేయడం కష్టం కానీ సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఊరమాస్ అనిపించే లెవల్ లోనే జరుగుతుందని ఇక థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్ లో జరిగితే సినిమా బడ్జెట్ రికవరీ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంటేనే బడ్జెట్ కి న్యాయం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.