మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆచార్య బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తీ చేసుకుంది. సినిమా టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ గా నిలిచి చరిత్రకెక్కింది. కాగా సినిమా అన్ని ఏరియాలలో సాధించిన లాస్ ఒకెత్తు అయితే నైజాం ఏరియాలో సాధించిన లాస్ మరో ఎత్తు గా చెప్పుకోవాలి…
సినిమాను నైజామ్ ఏరియాలో ఆల్ మోస్ట్ 38 కోట్ల మమ్మోత్ రేటుకి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ టికెట్ హైక్స్ అడ్వాంటేజ్ తో మంచి రిలీజ్ ను సొంతం చేసుకున్నా మొదటి రోజు నుండే నిరాశ పరిచిన సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ టైం కి పరుగును పూర్తీ చేసుకోగా టోటల్ రన్ లో నైజాం ఏరియాలో సినిమా 12.45 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే వెనక్కి రాబట్టింది. దాంతో 38 కోట్ల బిజినెస్ కి గాను ఆల్ మోస్ట్ 25.55 కోట్ల లాస్ ని ఒక్క నైజాం ఏరియాలోనే సొంతం చేసుకుని ఎపిక్ ఆల్ టైం డిసాస్టర్ మూవీ గా నిలిచింది.