Home న్యూస్ ఇదే ఫైనల్…F3 మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్…F3 మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

0

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మార్నింగ్ షోల టైం కి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ షోల టైం కి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా సినిమా ఏ టాక్ ఫిక్స్ అయ్యింది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.

ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే కొంచం రొటీన్ సీన్స్ బోర్ అనిపించినా కానీ ఓవరాల్ గా ఎఫ్2 రేంజ్ లోనే ఎఫ్ 3 కూడా ఆకట్టుకుందని, వెంకటేష్ కామెడీ టైమింగ్ ఆకట్టుకోగా వరుణ్ తేజ్ మరియు సునీల్ లు కూడా మెప్పించారని….

సెకెండ్ ఆఫ్ లో వచ్చే స్పూఫ్స్ మరింత బాగా మెప్పించడంతో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా సినిమా బాగా మెప్పించింది అంటూ చెబుతున్నారు, మొత్తం మీద వీళ్ళ నుండి సినిమా కి హిట్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఇక కామన్ ఆడియన్స్ లో కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి సినిమాలో ఇల్లాజికల్ సీన్స్…

మరీ ఓవర్ ది టాప్ కి వెళ్ళినట్లు అనిపించిందని చెబుతున్నా కొన్ని సీన్స్ వరకు అయితే సినిమా బాగానే నవ్వించింది అంటున్నారు, ఇక మరో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇలాంటి కామెడీ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి అయితే సినిమా బాగానే నచ్చింది అంటున్నారు….. కొన్ని బోర్ సీన్స్ పై మరింత ఫోకస్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా సినిమా ఉండేదని అంటున్నారు…

ఓవరాల్ గా వాళ్ళనుండి సినిమా కి ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ వినిపిస్తుండగా మొత్తం మీద రోజు ముగిసే సరికి సినిమా కి ఫైనల్ గా ఎబో యావరేజ్ నుండి హిట్ కి మధ్యలో టాక్ ఫిక్స్ అయింది అని చెప్పాలి, ఎఫ్2 కూడా ఇదే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది, ఇక ఎఫ్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ని చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here