బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉన్న ఎఫ్3 మూవీ 6వ రోజు అనుకున్న దాని కన్నా కొంచం బెటర్ గా హోల్డ్ చేసింది. ఇక సినిమా 7వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా తెలుగు రాష్ట్రాలలో మరోసారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి పర్వాలేదు అనిపిస్తున్న సినిమా…
మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 7వ రోజు 1.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది, ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కనుక బాగుంటే సినిమా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 7వ రోజు 1.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా మొదటి వారాన్ని మంచి కలెక్షన్స్ తోనే ముగించబోతుండగా రెండో వారంలో సాలిడ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి.