బాక్స్ ఆఫీస్ దగ్గర లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహాద్ ఫాజిల్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విక్రమ్ సెన్సేషనల్ వీకెండ్ ని పూర్తీ చేసుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కలెక్షన్స్ మొదటి రోజు కన్నా కూడా బెటర్ గా ఉండటం విశేషం అని చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో. సినిమా తెలుగు రాష్ట్రాలలో మూడో రోజు ఏకంగా….
2.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ కన్ఫాం అనుకున్నా ఫైనల్ డే 3 కలెక్షన్స్ లెక్క టోటల్ గా అంచనాలను అన్నింటినీ కూడా మించి పోయి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడు రోజుల వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే….
👉Nizam: 2.46Cr
👉Ceeded: 91L
👉UA: 94L
👉East: 59L
👉West: 40L
👉Guntur: 49L
👉Krishna: 45L
👉Nellore: 31L
AP-TG Total:- 6.55CR(12.26CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా వీకెండ్ కలెక్షన్స్…
మొత్తం మీద తెలుగు బిజినెస్ 7 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కోసం 7.50 కోట్లు కావాల్సి ఉండగా సినిమా ఇంకా 55 లక్షల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా 3 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 64.50Cr
👉Telugu States- 12.26Cr
👉Karnataka- 11.02Cr
👉Kerala – 14.05Cr
👉ROI – 2.35Cr
👉Overseas – 56.10CR
Total WW collection – 160.28CR
ఇదీ మొత్తం మీద సినిమా 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క. సినిమా 3 రోజుల్లో మొత్తం మీద 80.95 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. మూడు రోజుల్లో 135 కోట్లకు పైగా గ్రాస్ అనుకుంటే ఫైనల్ లెక్కలు ఏకంగా 150 కోట్ల మార్క్ ని అందుకోవడం ఊచకోత అనే చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.