బాక్స్ ఆఫీస్ దగ్గర కమల్ హాసన్ లేటెస్ట్ మూవీ విక్రమ్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఊరమాస్ హోల్డ్ ని చూపిస్తూ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ని దక్కించుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు రాష్ట్రాలలో 90 లక్షల నుండి కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు అనుకున్నా కానీ సినిమా….
కేవలం 7 లక్షలు మాత్రమే 4వ రోజుతో పోల్చితే 5వ రోజు డ్రాప్ అయ్యి 1.28 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక సినిమా మొత్తం మీద 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 3.75Cr
👉Ceeded: 1.22Cr
👉UA: 1.31Cr
👉East: 74L
👉West: 50L
👉Guntur: 64L
👉Krishna: 65L
👉Nellore: 37L
AP-TG Total:- 9.18CR(16.71CR~ Gross)
మొత్తం మీద 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఆల్ రెడీ 1.68 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకు పోతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
వరల్డ్ వైడ్ గా 5 వ రోజు ఏకంగా 20.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని 10.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 81.50Cr
👉Telugu States- 16.71Cr
👉Karnataka- 15.10Cr
👉Kerala – 20.40Cr
👉ROI – 3.50Cr
👉Overseas – 72.10CR( updated )
Total WW collection – 209.31CR(105.50CR~ Share)
మొత్తం మీద సినిమా 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది అని ట్రేడ్ వర్గాల అంచనా. ఆ లెక్క ప్రకారం సినిమా 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది ఈ సినిమా…ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతున్న ఈ సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.