Home న్యూస్ అంటే సుందరానికీ మైండ్ బ్లాంక్ బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావొచ్చు!!

అంటే సుందరానికీ మైండ్ బ్లాంక్ బుకింగ్స్ రిపోర్ట్…ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావొచ్చు!!

0

నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా రీసెంట్ టైం లో నాని నటించిన సినిమాల్లో వి ది మూవీ మరియు టక్ జగదీష్ సినిమాలు డిజిటల్ లో రిలీజ్ అవ్వగా శ్యామ్ సింగ రాయ్ సినిమా థియేటర్స్ లో క్రిస్టమస్ టైం లో రిలీజ్ అయినా టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో ఓపెనింగ్స్ బాగున్నా ఎక్కువ…

షేర్స్ ని అందుకోలేదు. ఆ లోటుని ఇప్పుడు అంటే సుందరానికీ సినిమా తీర్చుతుంది అని అందరూ అనుకున్నా కానీ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ ఎక్కడా కూడా బుకింగ్స్ అసలు అంచనాలను అందుకునేలా అయితే లేవనే చెప్పాలి…

ఉన్నంతలో ఒక్క అమెరికాలో మాత్రం ఆల్ మోస్ట్ 120K డాలర్స్ అడ్వాన్స్ టికెట్ సేల్స్ జరిగాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంటే సుందరానికీ సినిమా కంప్లీట్ గా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతున్న సినిమాగా చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ నాని నటించిన రీసెంట్ మూవీ…

శ్యామ్ సింగ రాయ్ తో పోల్చినా చాలా నార్మల్ గానే ఉండటంతో ఆ ఇంపాక్ట్ ఓపెనింగ్స్ పై గట్టిగానే ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవుతున్న సినిమా నార్మల్ గా రోజు మొత్తం యావరేజ్ ఆక్యుపెన్సీతోనే రన్ అయ్యి టాక్ పాజిటివ్ గా ఉంటె 3 కోట్ల నుండి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని…

అందుకునే అవకాశం ఉండగా టాక్ అద్బుతంగా ఉండి షో షో కి కలెక్షన్స్ లో సాలిడ్ గ్రోత్ కనుక ఉంటె కలెక్షన్స్ 4 కోట్ల రేంజ్ లో వెళ్ళే అవకాశం ఉంది, కానీ సినిమా బిజినెస్ దృశ్యా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఇక సినిమా టాక్ ఎలా ఉంటుంది ఎంతవరకు సినిమా ఓపెనింగ్స్ విషయంలో జోరు చూపించగలుగుతుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here