బాక్స్ ఆఫీస్ దగ్గర నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించినా కానీ 4వ రోజు వర్కింగ్ డే లో సినిమా అనుకున్న దాని కన్నా కూడా భారీగా డ్రాప్ అయింది. సినిమా 70% డ్రాప్ అవ్వగా ఇప్పుడు 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో సినిమా మరో సారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాలతో పోల్చితే సినిమా ఓవర్సీస్ లో కొంచం బెటర్ గా హోల్డ్ చేస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం సినిమా భారీగా డ్రాప్ అయింది, పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి డ్రాప్స్ అస్సలు ఎవ్వరూ కూడా అంచనా వేయలేదు అనే చెప్పాలి… మొత్తం మీద సినిమా ఇప్పుడు….
తెలుగు రాష్ట్రాలలో 5వ రోజు ఇప్పుడు 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, వరల్డ్ వైడ్ గా సినిమా 70 లక్షల రేంజ్ లో 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇవి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక సినిమా 5 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.