బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికీ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది, కానీ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం తెలుగు రాష్ట్రాలలో కంప్లీట్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ పరుగును కొనసాగిస్తుంది. సినిమా అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగా ఉండగా తెలుగు రాష్ట్రాలలో కంప్లీట్ గా డౌన్ అవుతున్న సినిమా ఇక్కడ తో పోల్చితే ఓవర్సీస్ లో మట్టుకు ఎక్స్ లెంట్…
కలెక్షన్స్ తో పరుగును సాలిడ్ గా కొనసాగిస్తూ ఉంది. సినిమా 4వ రోజుతో పోల్చితే 5వ రోజు అక్కడ ట్యూస్ డే ఆఫర్స్ తో ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా ఇప్పుడు $940K మార్క్ ని అందుకుని ఇప్పుడు 1 మిలియన్ మార్క్ వైపు అడుగులు వేస్తుంది…
టోటల్ ఓవర్సీస్ లో సినిమా బిజినెస్ 3.50 కోట్లు కాగా సినిమా 4.50 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను కూడా సొంతం చేసుకుంది. ఇక్కడ సినిమా ఎలా ఉన్నా కానీ ఓవర్సీస్ లో మట్టుకు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది అని చెప్పాలి.